ప్రపంచ మార్కెట్‌పై ట్రంప్ ప్రకటన ప్రభావం

Advertisements

<p>ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట&period; గల్ఫ్ రీజియన్‌లో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి&period; ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి&period; ముఖ్యంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు కుప్పకూలుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు&period; గత కొన్ని రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఖాయమని భావించిన తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; తన ట్రూత్ సోషల్ వేదికగా&period;&period; ఇరాన్‌పై సైనిక దాడులను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు&period; అయితే&comma; దీనికి ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఆయన షరతు విధించారు&period; ఈ ప్రకటన వెలువడిన వెంటనే గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి&period; గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు&comma; ఇప్పుడు ఒక్కసారిగా 100 డాలర్ల దిగువకు పడిపోయాయి&period; ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది&period; ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం&period; ధరలు తగ్గడం వల్ల దేశీయంగా పెట్రోల్&comma; డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది&period; అయితే&comma; ఈ శాంతి కేవలం తాత్కాలికమేనని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; రాబోయే రెండు వారాల దౌత్య చర్చలు సఫలమైతేనే పరిస్థితి చక్కబడుతుందని&comma; లేదంటే మళ్ళీ యుద్ధ భయాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ రెండు వారాల విరామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్‌లా పనిచేస్తోంది&period; మరి ఇరాన్ ఈ షరతులకు తలొగ్గుతుందా లేదా అన్నది వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.