ఏపీ రాజధానిగా విశాఖను ప్రకటిస్తామని హామీ..
విజన్ వైజాగ్ సదస్సు(Vision Vizag Conference)లో ఏపీ సీఎం జగన్(CM Jagan) సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖ(Visakhapatnam)లో ఉంటానని వెల్లడించారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ(Visakhapatnam)ను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ రెండోసారి సీఎంగా తాను విశాఖ(Visakhapatnam)లోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఏపీ గ్రోత్ ఇంజన్ లా విశాఖను మారుస్తానని తెలిపారు. హైదరాబాద్(Hyderabad) కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని హంగులన్నీ విశాఖ(Visakhapatnam)కు ఉన్నాయంటూ సీఎం వ్యాఖ్యానించారు.
విజన్ వైజాగ్ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్..
విశాఖ(Visakhapatnam)లోని విజన్ వైజాగ్ సదస్సు(Vision Vizag Conference)లో పాల్గొన్న సీఎం జగన్(CM Jagan) అమరావతి(Amaravati) రాజధానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి(Amaravati)ని రాజధాని చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలన్నారు. అమరావతి(Amaravati) శాసన రాజధానిగా కొనసాగుతోందని తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. దేశాన్ని ఆకర్షించే విధంగా విశాఖ(Visakhapatnam)లో సెక్రటేరియట్ నిర్మాణం చేపడతామని సీఎం జగన్(CM Jagan) తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: పోలీసులు వాహన తనిఖీలు.. రూ.కోటి 9 లక్షలు సీజ్ !
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.