ఏపీ సీఎం జగన్(AP CM Jagan) పై విజయవాడలో దాడి జరిగింది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర(Memantha Siddham Bus Yathra) సాగిస్తుండగా, సింగ్ నగర్ వద్ద ఆగంతుకులు రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న స్కూలు భవనం పై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. కాగా, క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్టు భావిస్తున్నారు. పోలీసులు స్కూలు భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.
ఇది చదవండి: చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు…
సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్డులో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైంది. సీఎం జగన్ కు బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో యాత్ర ముగిసిన తర్వాత.. జగన్ సతీమణి భారతీ అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.