ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం…

CM launched Indiramma Houses Scheme

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది&period; ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు&period; స్వంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు&comma; ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా సర్కార్ నిర్ణయం తీసుకుంది&period; గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కలను దశలా వారీగా నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అర్హులైన వారికే లబ్ధి చేకూరుస్తామని తెలిపింది &period; లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది&period; సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు&comma; డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే తయారు చేయించింది&period; ఈ ఇళ్ల నిర్మాణాల్లో తప్పనిసరిగా ఒక వంటగది&comma; టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణాల నమూనాలు రిలీజ్ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..