కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ..
ఉమ్మడి మహబూబ్ నగర్(Mahabubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(Election Polling) నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఓటు వేశారు. స్వయంగా ఊరు వెళ్లి కొడంగల్ ఎంపీడీవో కార్యాలయం(Kodangal MPDO Office)లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం 1439 మంది ఓటర్ల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు 89 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి