మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి.. సీఎం రేవంత్ ఆదేశం

cm meeting on medigadda bridge

Advertisements

&NewLine;<p>రిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష&period; హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&period; ఇరిగేషన్ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష&period; మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం&period; కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు&period; గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు&period; ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు&comma; ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు&period; యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు&period; నీటి లభ్యత&comma; ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు&period; అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు&period; సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం&period; ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; ఈఎన్ సీ మురళీధర్&comma; సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.