తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి, అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థకు చేరింది. నాయకత్వ లేమి పార్టీకి ఇబ్బందిగా మారింది. 2014, 18 ఎన్నికల్లో చతికిలపడింది. ఈ కష్టకాలంలో రేవంత్ ఎంట్రీ ఆ పార్టీకి ఊపు తెచ్చిందనే చెప్పాలి. ఇటు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న అధిష్టానం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంది. సీనియర్ నేతల ఏకతాడిపైకి రావడం, రేవంత్ మాస్ లీడర్ షిప్ గెలుపు తీరాలకు చేర్చి కాంగ్రెస్ పదేశ్ల నిరీక్షణకు తెరదించారు. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. L.B. స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదే విధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.
Read Also..
Read Also..