సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా….

CMD Prabhakar Rao resigned

Advertisements

&NewLine;<p>తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు&period; వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు&period; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో&comma; జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది&period; గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో&comma; జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు&period; సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు&period; అయితే&comma; బీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది&period; అప్పటి నుంచి పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది&period; తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే&period; ఈ క్రమంలోనే ట్రాన్స్ కో&comma; జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.