126
తన మాటను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా ఒక రైతు సమస్యను పరిష్కరించాలని, రెవిన్యూ అధికారులను చెప్పినా పట్టించుకోక పోవడంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే మాట వింటూ.. ఎమ్మెల్సీ జంగా.. పనులు చేయమని అధికారులను ఆదేశించినా కూడా పనులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్వయంగా చెప్పినా అధికారులు పనిచేయడం లేదంటే.. ఇక సామాన్య ప్రజల మాటేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.