చదువులమ్మ తల్లి ఒడిలో వైసీపీ కరపత్రాలు పట్టుకుని విద్యార్థి విభాగం మీటింగ్ అంటూ చేసిన హడావిడి విద్యావేత్తలను ముక్కు మీద వేలు వేసుకొనిలా చేస్తోంది. కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఈ భాగోతం జరిగింది. బుధవారం ఛాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు. ముందు రోజు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ సమావేశానికి అనుమతి ఇచ్చారు. ఓ రాజకీయ పార్టీ సమావేశానికి యూనివర్సిటీని ఎలా అనుమతిచ్చారంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జగనన్న కాలేజీ కెప్టెన్సి పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మళ్ళీ జగన్ ను సీఎం చేయాలంటూ ఈ కార్యక్రమంలో పిలుపునివ్వడం, జగన్ ఫోటోలతో ఉన్న టీ షర్ట్ లు విద్యార్థులు ధరించడం వివాదం అయింది. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమానికి ముందు రోజు వైసీపీ జెండాలతో యూనివర్సిటీని నింపేయడం పట్ల విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విసీ అసమర్ధతకు ఇది నిదర్శనమని కాలేజ్ ప్రొఫెసర్లు కూడా అంగీకరిస్తున్నారు.
విసీ గారు.. ఇదేంది సారు
89
previous post