అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సిపిఐ కాలనీలోని పార్టీ కార్యాలయం ఆవరణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జండాను కామ్రేడ్ షఫీ ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ భారతీయ కమ్మునిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న నాగపూర్ పట్టణంలో ఆవిర్భవించి నాటినుండి నేటివరకు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం నిరంతరం పోరాడుతూ కార్యక్రమాలు చేపడుతూ వెళుతుందని వివరించారు. అదేవిధంగా అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం లో పార్టీ నుంచి 56 మంది శాసనసభ్యులతో ప్రాతినిధ్యం వహించి కూడు, గూడు, గుడ్డ, మరియు దున్నేవాడికి భూమి కావాలని కార్మికులకు పనికి తగ్గట్టు వేతనంతోపాటు ఎనిమిది గంటలు రోజుకు పని ఉండాలని బ్యాంకులను జాతీయం చేయాలని ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం..
144
previous post