పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విబేధాలు రోడెక్కినాయి. జ్యోతిరావు పూలే విగ్రహం వేదికగా గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. విడివిడిగా జ్యోతిరావు పూలే విగ్రహంకి వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఒక పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గం, మరో ప్రక్క గజ్జల బ్రమ్మారెడ్డి వర్గం. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం వేదికగా వైసీపీ అసంతృప్తి నేతలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. నా వల్ల పదవులు పొంది, నాపైనే ఎదురు తిరుగుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నరసరావుపేట నుండి నేనె పోటీ చేస్తాను. ఇప్పుడు దాకా నా మంచితనం చుశారు, ఇక నుండి నేనేంటో చూపిస్తాను. ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎంత దూరమో, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి అంతే దూరం గుర్తు పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలు పొందుతాను.
నరసరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు..
92
previous post