80
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు. కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. సీఎం జగన్ ఎలాంటి వివక్ష చూపకుండా పరిహారాన్ని అందజేశారన్నారు.