మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రగతి నగర్ లో ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెక్క సామగ్రి, సోఫాలు, పడకలు, ఇతర ఫర్నిచర్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 15 నుండి 25 వరకు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కో దుకాణానికి సుమారు 20 నుండి 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. మొత్తం మీద కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.బాధిత వ్యాపారులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
fire
పార్వతిపురం మన్యం జిల్లా. నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం. పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి.. సమాచారం అందించిన గ్రామస్తులు. సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ ఖాతాకు నిధులు జమచేశారు. ఈ మొత్తాన్ని మంత్రి అప్పలరాజు బాధితులకు అందజేశారు. కాలిపోయిన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ హార్బర్ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. సీఎం జగన్ ఎలాంటి వివక్ష చూపకుండా పరిహారాన్ని అందజేశారన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెస్ ఆఫీస్ రెండో అంతస్తులో మొదటి రెండు రూమ్ లలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ వలన లేక బాణాసంచా కాల్చడం వల్ల ఆనేది తెలియాల్సి ఉంది. ఫైర్ సిబ్బంది, పోలీసులు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందని విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు .
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి లో దీపావళి టపాసులు పెలుస్తుండగ బస్వాని రాంబాబు, రాములకు చెందిన పూరిల్లు దగ్దంమయ్యింది. పిల్లలు టపాసులు పెల్చుతుండగ ప్రమాదం సంభవించడం తో ఇల్లు పూర్తిగా దగ్ధమై ఇంటిలో నివాసం ఉంటున్న మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యరు. సంఘటన ప్రాంతానికి హుటహుటీన ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కుటుంబం లోకి బాధితురాలికి 2 లక్షల రూపాయలు డ్వాక్రా డబ్బులు వచ్చాయని అవి కూడా దగ్ధమైనవని బాధితులు వాపోయారు . ఈ ప్రమాదంలో మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంబంధించినట్లు బాధితులు తెలిపారు.




Total views : 78946