దొంగ ఓట్లపై సీఈసీ కి ఫిర్యాదు…

Pawan Kalyan and Chandrababu met the CEC team

Advertisements

&NewLine;<p>ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి నెలకొందని&comma; చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు&period; రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌&comma; చంద్రబాబు కలిశారు&period; అన్ని విషయాలను కమిషన్‌కు వివరించామన్నారు&period; అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని&comma; ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీ కి ఫిర్యాదు చేశామన్నారు&period; మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారని&comma; టీడీపీ &&num;8211&semi; జనసేనపై 7 వేల అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు&period; అయితే ఎన్నికల విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కామని ఎలక్షన్ కమిషన్ మాట ఇచ్చిందన్నారు&period; ఒక్క దొంగ ఓటు ఉన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతామని చంద్రబాబు స్పష్టం చేశారు&period; తామిచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని కమిటీ చెప్పిందన్నారు&period; ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని&period;&period; 1&sol;4 దొంగ ఓట్లు చేర్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు&period; రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు&period; రెండు నెలల‌ ముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని&comma; వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు&period; పారదర్శకంగా&comma; నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని కమిటీ తెలిపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.