ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య వివాదం..!

Conflict between North Korea and South Korea

Advertisements

&NewLine;<p>ఉత్తర కొరియా తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వేళ ఉత్తర కొరియా&comma; దక్షిణ కొరియాల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది&period; సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి&excl; 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం సరిహద్దులో తొలగించిన గస్తీ కేంద్రాలను ఉత్తర కొరియా పునరుద్ధరిస్తున్నట్లు సియోల్‌ ఆరోపించింది&period; సైన్యంతోపాటు భారీఎత్తున ఆయుధాలనూ మోహరించినట్లు పేర్కొంది&period; సైనిక ఘర్షణలను తగ్గించేందుకుగానూ 2018 నాటి ఓ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు గతంలో తమ సరిహద్దుల్లో 11 చొప్పున &OpenCurlyQuote;గార్డు పోస్ట్‌’లను తొలగించాయి&period; ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగానికి ప్రతిగా 2018 నాటి ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపేస్తున్నట్లు దక్షిణ కొరియా ఇటీవల ప్రకటించింది&period; దీన్ని కనీస రక్షణ చర్యగా పేర్కొంటూ తమ నిఘా విమానాలు తిరిగి సరిహద్దుల్లోని నోఫ్లై జోన్‌లో ఎగురుతాయని తెలిపింది&period; దీన్ని ఉత్తర కొరియా తప్పుబట్టింది&period; ఇకపై ఆ ఒప్పందానికి తామూ కట్టుబడి ఉండబోమని తెలిపింది&period; ఈ క్రమంలోనే సరిహద్దుల్లో గస్తీ కేంద్రాల పునరుద్ధరణ&comma; కందకాల నిర్మాణం వంటి పనులను గుర్తించినట్లు à°¦&period;కొరియా సైన్యం మీడియాకు తెలిపింది&period; ఉత్తర కొరియా అక్కడ సైన్యాన్ని&comma; భారీ ఆయుధాలను మోహరించినట్లు గుర్తించామని చెప్పింది&period; ఈ పరిణామాల నడుమ సరిహద్దుల్లో ఉత్తర కొరియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది&period; ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దృఢమైన సంసిద్ధతను కొనసాగించాలని సూచించారు&period; ఇదిలా ఉండగా ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని దక్షిణ కొరియా&comma; అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే&period; దీన్ని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రెచ్చగొట్టే చర్యగా పేర్కొన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.