టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు ఓటమి భయంతోనే తన అనుచరులతో రాళ్ల దాడులు చేయిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు..గురువారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని కొత్త రాంనగర్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గ్రామ సర్పంచ్ తమ్ముడు కృష్ణ నాయక్ రాయితో నాపై దాడి చేయగా అది తప్పిపోయి ప్రచార వాహనంపై పడిందని అన్నారు..ఎవరు ఎన్ని కుట్రలు చేసిన అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని దీన్ని ఎవరు ఆపలేరని ఆయన అన్నారు..అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నా కుటుంబ సభ్యులని నా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఎలాంటి ఆపాద, అన్యాయాలు జరిగినా నేను ముందుండి ప్రశ్నిస్తానని ఆయన భరోసా ఇచ్చారు..గువ్వల బాలరాజు నీవు ఎన్ని డ్రామాలు చేసిన నీ డ్రామాలను అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు..ఈ ప్రాంతంలో పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగిన ఈ ప్రాంతంలోనే చనిపోతా నా ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా నేను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు..ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయాలను అపవిత్రం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..దాడి చేసిన వ్యక్తిని పక్కనే ఉన్న పోలీసులు సైతం పట్టుకొని స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు..ఎవరు దాడులు చేస్తున్నారు అన్ని గమనిస్తున్నారని నీకు ఈ నెల 30న జరిగే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పి నీ సొంత ప్రాంతం వనపర్తి జిల్లాకు సాగనంపడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు..
గువ్వల నీ చిల్లర రాజకీయాలు ఆపు…రాళ్లదాడి పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఫైర్….
77
previous post