కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. లోక్ సభ అభ్యర్థుల ఖరారు

Finalization of Lok Sabha candidates

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో ఎనిమిది లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది&period; ఇది వరకే నలుగురు అభ్యర్థులను ఖరారు చేశారు&period; మరో ఎనిమిది మందిని ఖరారు చేయడంతో మొత్తం 12 మంది అభ్యర్థులు ఖరారయినట్లు అయింది&period; అయితే మరో ఐదు స్థానాలను పెండింగ్‌లో ఉంచారని తెలుస్తోంది&period; 8 రాష్ట్రాలకు సంబంధించి 50 మంది అభ్యర్థులు ఖరారయ్యారు&period; ఇందులో తెలంగాణ నుంచి ఎనిమిది మందిని ఖరారు చేశారు&period; పలు రాష్ట్రాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఖరారుపై దాదాపు మూడు గంటల పాటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది&period; తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై అసంపూర్తిగా చర్చ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు&period; మరికొన్ని సీట్లలో ఖరారుపై ఈ నెల 21à°¨ మరోసారి సమావేశం కానున్నారు&period; తదుపరి భేటీలో పెండింగ్ స్థానాల అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్నారు&period; తెలంగాణ&comma; అరుణాచల్ ప్రదేశ్&comma; సిక్కిం&comma; పశ్చిమ బెంగాల్&comma; చత్తీస్‌గఢ్&comma; అండమాన్ నికోబర్&comma; పుదుచ్చేరి&comma; కర్ణాటక&comma; మధ్యప్రదేశ్&comma; గుజరాత్&comma; రాజస్థాన్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చ జరిగింది&period; అభ్యర్థులు&comma; సీట్లపై చర్చ జరిగిందని… సీట్ల కేటాయింపు వివరాలను అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.