ప్రజాపాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ప్రజాపాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది&period; ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు&comma; ఎస్పీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు&period; సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు&comma; ఎస్పీలు&comma; ఉన్నత అధికారులు&comma; పలువురు మంత్రులతో ఆయన సెక్రటేరియట్‌లోని ఏడో అంతస్తులోని హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైనే స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వనున్నారు&period; 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలన యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేశారు&period; బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చించడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు&period; ప్రజావాణిని జిల్లా&comma; డివిజన్‌&comma; మండల&comma; గ్రామ స్థాయుల్లో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు&period; ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు&comma; మంత్రులు&comma; వివిధ శాఖల కార్యదర్శులు&comma; సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.