87
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహును వెంటనే అరెస్టు చేసి సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్ఖండ్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ఇంట్లో ఐటీ దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది కోట్లు పట్టుబడడం కాంగ్రెస్ వారి అవినీతికే అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారు పేరు అని ఎద్దేవా చేశారు. వెంటనే ధీరజ్ సాహూను అరెస్టు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.