పశ్చిమగోదావరి(West Godavari) జిల్లా నర్సాపురం ఆర్టీసీ కార్గో(RTC Cargo)లో అవినీతి బాగోతం బయటపడింది. డబ్బులు గోల్ మాల్ అయ్యాయి. పార్శిల్ బుకింగ్ సొమ్మును ఎప్పటికప్పుడు సంస్థకు జమ చేయకపోవడంతో ఈ బాగోతం బయటపడింది. పది రోజుల నుంచి ఆర్టీసీ ఆడిట్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఏటా ఆర్టీసీ డిపోల వారిగా ఆడిట్ నిర్వహించడం పరిపాటి. ఈ క్రమంలో కార్గో వాహనాలకు ఆదాయం కంటే ఆయిల్ ఖర్చే ఎక్కువ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆడిట్ సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. ఆర్టీసీ ఆడిట్ అధికారి కాశీం రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఇది చదవండి: జై శ్రీరామ్ అంటూ మారుమ్రోగిన నూతిపాడు గ్రామం…
ఇందులో పార్శిల్ బుకింగ్ అయిన వెంటనే సొమ్మును రికార్డులో నమోదు చేయలేదు. రెండు, మూడు రోజులకు ఒకసారి జమ చూపించారు. కొన్ని రశీదులు వారం తర్వాత చూపించారు. ఇప్పటి వరకు జరిపిన ఆడిట్లో లక్షల్లో తేడా కనిపించింది. ఇలా ఎన్ని ఏళ్లుగా జరిగిందన్న దానిపై రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై సివిఆర్ న్యూస్ డీఎం సుబ్బన్నరెడ్డిని వివరణ కోరగా పార్శిలక్స్కు సంబంధించిన సొమ్ములు ఏ రోజుకారోజు జమ కాలేదన్న విషయం ఆడిట్లో బయటపడిందన్నారు. దీనిపై రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి జమ చేశారు. నిధులు ఏమైనా పక్కదారి పట్టాయా ? అనేదానిపై పూర్తిగా ఆడిట్ జరగాల్సి ఉందన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి