తల్లిగా భావించే యూనివర్సిటీలో అవినీతి..

Krishnaiah

Advertisements

&NewLine;<p>ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చదువుల తల్లిగా భావించే కాకతీయ యూనివర్సిటీ లో అవినీతి రాజ్యం ఎళుతుంది&period; తాజాగా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు&period; విద్యార్థుల ట్యూషన్ ఫీజులు&comma; ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన 3 కోట్ల కుంభకోణంపై ఏ ఆర్ కిష్టయ్య&comma; ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య పై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్ కిష్టయ్య ను క్యాంపస్ కు మార్చారు&period; న్యాక్ కోసం కేటాయించిన 10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి&period; యూనివర్సిటీ లో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి&period; న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు&comma; హాస్టళ్లు&comma; ఇతర బిల్డింగ్ ల కోసం రూ&period;10 కోట్ల కేటాయించారు&period; వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్&comma; పబ్లికేషన్స్ సెల్&comma; హాస్టల్ ఆఫీస్ తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు&period; ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి 50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది&period; అయితే ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్