మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి

Mizoram

Advertisements

&NewLine;<p>మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది&period; ఆరు పార్టీల కూటమి జొరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ విజయం సాధించింది&period; మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా జెడ్ పీఎం కూటమి 27 చోట్ల విజయం సాధించింది&period; అధికార ఎంఎన్ఎఫ్ 10&comma; బీజేపీ 2&comma; కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించాయి&period;<br>ఈ ఎన్నికల్లో మిజోరం సీఎం జొరామ్ తంగా ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు&period; మిజోరం అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 21 స్థానాలు&period;<br>మాజీ ఐపీఎస్ అధికారి&comma; ఎంఎల్ఏ లాల్ దుహోమా జెడ్ పీఎమ్ కూటమిని స్థాపించారు&period; ఈ కూటమిలో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్&comma; జొరామ్ నేషనలిస్ట్ పార్టీ&comma; జొరామ్ ఎక్సోడస్ మూవ్ మెంట్&comma; జొరామ్ డీసెంట్రలైజేషన్ ఫ్రంట్&comma; జొరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్&comma; మిజోరం పీపుల్స్ పార్టీ సభ్యులుగా ఉన్నాయి&period; తొలినాళ్లలో ఈ కూటమి సామాజిక సమస్యలపై పోరాడే వేదికగానే ప్రస్థానం ప్రారంభించింది&period; 2019లో ఈ కూటమికి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ గుర్తింపునిచ్చింది&period; అనతికాలంలోనే అధికార మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి ప్రత్యామ్నాయం అనదగ్గ స్థాయికి ఎదిగింది&period; ఇప్పుడు ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..