అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అల్లూరి జిల్లాలో పర్యటన లో భాగంగా గురువారం చింతపల్లి సభా స్థలానికి చేరుకొని గిరిజనుల సమస్యల కోసం వారి చట్టాల కోసం ఏమి మాట్లాడలేదని అల్లూరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్య దర్శి సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. ఏజెన్సీ గిరిజన ప్రజల సమస్యలను ముందుగానే పత్రికల ద్వారా తెలియపరచామని వాటిని వేటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్థావనo చేయలేదని ఉన్నారు. హైడ్రో ఫ్లవర్ ప్రాజెక్ట్ కోసం కానీ బోయ వాల్మీకి కోసం కానీ జీవో నెంబర్ 3 కోసం కానీ ఏమి మాట్లాడలేదు. సభా సమావేశానికి రెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి విద్యార్థులకు ట్యాబ్లు పంచిపెట్టి పుట్టినరోజు వేడుక జరుపుకుని వెళ్లిపోయారని గిరిజన సమస్యల కోసం ఏమాత్రం కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. చింతపల్లిలో సభ సమావేశానికి ఖర్చుపెట్టిన సొమ్మును శ్వేత పత్రo విడుదల చేయాలని అన్నారు. పది రోజులు బట్టి అంగనవాడి కార్యకర్తలు వారి న్యాయమైన సమస్యల కోసం సమ్మె చేస్తుంటే వారి సమస్యలు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా అని సిపిఎం పార్టీ జిల్లా కార్య దర్శి సభ్యులు బోనంగి చిన్నియ్య పడాల్ సభ్యులు అన్నారు.
గిరిజన సమస్యల పై ఎందుకు ఇంత నిర్లక్ష్యం…
86
previous post