మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.

Advertisements

<p>మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది&period; ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు&period;&period; గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు&period; అవినీతి&comma; అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది&period;<&sol;p>&NewLine;<p>అధికారికి సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు&period; హైదరాబాద్ బోడుప్పల్‌లో జీ ప్లస్ టూ భవనం&comma; కేపీహెచ్‌బీ కాలనీలో ఫ్లాట్‌తో పాటు ఐదు ప్లాట్లను గుర్తించారు&period; మూడు పాయింట్ రెండు ఒక ఎకరాల వ్యవసాయ భూమి&comma; మూడు కార్లు&comma; రెండు ద్విచక్ర వాహనాలు కూడా గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది&period;<br &sol;>&NewLine;సోదాల్లో రూ&period;10&period;03 లక్షల నగదు&comma; 629 గ్రాముల బంగారు ఆభరణాలు&comma; బ్యాంకు ఖాతాల్లో రూ&period;71&period;27 లక్షల నిల్వలు గుర్తించారు&period; ఎల్‌ఐసీ&comma; మ్యాక్స్ లైఫ్&comma; పోస్టాఫీస్ సేవింగ్స్‌తో పాటు ఇతర పెట్టుబడులను కూడా అధికారులు గుర్తించారు&period; ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ&period;3&period;06 కోట్లుగా ఉన్నట్లు ఏసీబీ తెలిపింది&period; అయితే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది&period;<br &sol;>&NewLine;మరోవైపు డ్రైవర్ ఖాతా నుంచి అధికారి కుమార్తె ఖాతాకు రూ&period;24&period;80 లక్షలు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది&period; ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తుల నుంచి డబ్బు సేకరించినట్లు డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం&period; ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు అదనపు ఆస్తులపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.