ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.

Advertisements

<p>ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది&period; పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది&period; ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది&period; అయితే&comma; ఆ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3 కోట్ల రూపాయల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది&period; ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని నిందితుడు 8 రోజుల క్రితం పిటిషన్ వేశాడు&period; తన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన<br &sol;>&NewLine;3 కోట్ల రూపాయల నగదును ఉపయోగించుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఐబొమ్మ రవి కోరగా&period;&period; అందుకు కోర్టు ఒప్పుకోలేదు&period; బ్యాంకు అకౌంట్లను ఉపయోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>కాగా&period;&period; పైరసీకి పాల్పడుతూ సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించడమే కాకుండా&comma; బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడన్న ఆరోపణలపై రవిని హైదరాబాద్ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు&period; ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడికి బెయిల్‌ లభించింది&period; అయితే&comma; అరెస్టు సమయంలో పోలీసులు తన ఖాతాల్లో ఫ్రీజ్‌ చేసిన 3 కోట్ల రూపాయలు తిరిగి అన్‌ఫ్రీజ్‌ చేయించాలని కోరుతూ నాంపల్లి 9à°µ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ కోర్టులో ఇమ్మడి రవి పిటిషన్‌ దాఖలు చేశాడు&period; తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని&comma; కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని తెలిపాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.