జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి

Advertisements

<p>హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్‌ ఐపీఎస్ ఆఫీసర్‌ వినయ్‌రంజన్‌రే భార్య హత్య&comma; దోపిడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి&period; పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘోరానికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు&period; ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పన అనే నేపాలీ మహిళ తన ప్రియుడు వికాస్ వేసిన క్రిమినల్‌ స్కెచ్‌ను అమలుచేసినట్టు దర్యాప్తులో తేలింది&period; నమ్మకంగా ఇంట్లో చేరి&comma; యజమానురాలి ప్రాణాలు తీసి&comma; కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్‌వర్క్ గుట్టును రట్టు చేశారు పోలీసులు&period;<&sol;p>&NewLine;<p>నేపాల్‌కు చెందిన కల్పన కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పుణెకు వచ్చింది&period; అక్కడ కొన్ని ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగించేది&period; ఆ సమయంలోనే ఆమెకు వికాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి&comma; అది కాస్తా ప్రేమగా మారింది&period; వికాస్ ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో పెద్ద ఎత్తున దోపిడీకి ప్లాన్ చేశాడు&period; గత 8 నెలల క్రితం వరకు వినయ్‌రంజన్‌రే ఇంట్లో మరో నేపాలీ మహిళ పనిచేసేది&period; ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన బంధువుల ఇంటికి వెళ్తూ&comma; నమ్మకస్తురాలంటూ కల్పనను ఈ ఇంట్లో పనికి కుదిర్చింది&period; యజమానుల దగ్గర చాలా నమ్మకంగా ఉన్న కల్పన&period;&period;ఇంట్లోని విలువైన వస్తువులు&comma; నగదు&comma; భద్రతా లోపాలను తన ప్రియుడు వికాస్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఈ క్రమంలోనే చోరీకి ప్లాన్‌ చేసిన వికాస్&comma; ఒక ముఠాను రంగంలోకి దించాడు&period; దోపిడీకి కొద్దిరోజుల ముందే పుణె&comma; ముంబయి&comma; బెంగళూరు నగరాల్లో వేర్వేరుగా నివసిస్తున్న ఎనిమిది మంది నేపాలీ యువకులను హైదరాబాద్‌కు రప్పించాడు&period; ఐతే ఈ ఎనిమిది మందికి ఒకరికొకరు అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు&period; హైదరాబాద్ చేరుకున్న తర్వాతే వీరంతా వికాస్ ద్వారా ఒక ముఠాగా ఏర్పడ్డారు&period; కల్పన&comma; వికాస్&comma; ఈ 8 మంది కలిపి మొత్తం 9 మంది సభ్యులు ప్రశాసన్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు&period; ఏ సమయంలో ఇంట్లో ఎవరు ఉంటారు&comma; ఎలా లోపలికి ప్రవేశించాలి&comma; ఏ మార్గం ద్వారా పారిపోవాలనే విషయాలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>పథకం ప్రకారం కల్పన&period;&period;ఇంట్లో ఇతర సభ్యులు లేని సమయం చూసి ముఠా సభ్యులను లోపలికి పిలిచింది&period; అడ్డువచ్చిన యజమానురాలు తనూజను దారుణంగా హత్య చేసి&comma; ఇంట్లోని భారీ సొత్తును దోచుకున్నారు&period; నేరం చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వీరు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు&period; జూబ్లీహిల్స్ నుంచి నేరుగా ఒక ఆటో ఎక్కి నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు&period; అక్కడ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి కాజీపేటలో దిగారు&period; రైల్వే స్టేషన్ దాటి బయటకు రాగానే&comma; టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తమను ట్రాక్ చేయకుండా ఉండేందుకు అందరి సెల్‌ఫోన్లను పగలగొట్టి పక్కన పడేశారు&period; ఆ తర్వాత కొట్టేసిన బంగారు నగలు&comma; నగదును అందరూ సమానంగా పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..