మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్ట్ …

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్ట్

Advertisements

<p>రెవెన్యూ శాఖలో మరో అవినీతి అధికారి గుట్టురట్టు అయ్యింది&period; మేడ్చల్‌&comma; మల్కాజ్‌గిరి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు&period; వంశీమోహన్ ఇల్లు&comma; ఆఫీసులతో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది&period; వనస్థలిపురం ఎన్‌‌జీవోస్‌‌ కాలనీలోని ఆయన ఇల్లు&comma; మేడ్చల్‌‌ కలెక్టరేట్‌‌లోని ఆయన ఛాంబర్‌‌‌‌ సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు&period; మొత్తం 6 కోట్ల 22లక్షల విలువ చేసే స్థిర&comma; చరాస్తులను సీజ్ చేశారు&period; వీటి విలువ మార్కెట్‌లో 100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు&period; అబ్దుల్లాపూర్‌‌‌‌ మెట్‌‌ మండలం పిగ్లీపూర్‌‌‌‌లో తన మామ పేరిట ఫేక్&ZeroWidthSpace; రిజిస్ట్రేషన్‌‌ చేసిన 8 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; రంగారెడ్డి&comma; మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వంశీమోహన్&ZeroWidthSpace; భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు&period; వంశీమోహన్ ఇంట్లో తన మామయ్య పేరిట ఉన్న 25 ఖాళీ దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు&period; ఇంట్లో రెండున్నర లక్షల నగదు&comma; 122 గ్రాముల బంగారు నగలు&comma; 32 లక్షల విలువ చేసే రెండు కార్లు సీజ్ చేశారు&period; బ్యాంకు అకౌంట్‌‌లో 20 లక్షలు ఫ్రీజ్ చేశారు&period; వీటితో పాటు 4&period;42 కోట్ల రూపాయల విలువ చేసే 19 ఓపెన్ ప్లాట్స్‌‌&comma; మణికొండలో రూ&period;1&period;12 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు&comma; ఇబ్రహీంపట్నం నర్రెపల్లిలో 2 ఎకరాల వ్యవసాయ భూమి&comma; అందులో రూ&period;10 లక్షలు విలువ చేసే ఫామ్‌‌హౌస్‌‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు&period; సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ&period;100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు&period; వంశీమోహన్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..