కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు.

కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు

Advertisements

<p>కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం జరిగింది&period; చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది&period; అయితే&comma; చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు&comma; బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు&period; తుని మండలం సి&period;హెచ్&period; అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్&comma; భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఆడుకుంటూ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యమైంది&period; అప్పటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు&period; ఐతే చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క తిరిగొచ్చి ఆందోళనగా ప్రవర్తించింది&period; చిన్నారి తల్లి భవాని చున్నీ పట్టుకుని లాగి&comma; మళ్లీ సమీపంలోని గుట్టల వైపు పరుగెత్తింది&period;<&sol;p>&NewLine;<p>ఈ పరిణామంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు&period; డాగ్ స్క్వాడ్‌తో కలిసి కుక్క వెళ్లిన దారిలో రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది&period; డీఎస్పీ తిలక్ నేతృత్వంలో వందలాది మంది పోలీసులు&comma; సీఐలు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని జీడితోటలు&comma; కొండ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతున్నారు&period; దర్యాప్తులో భాగంగా సమీపంలోని ఇనుప కంచె వద్ద లభించిన చిన్నారి&comma; కుక్క వెంట్రుకల నమూనాలను పోలీసులు సేకరించి పరీక్షలకు పంపారు&period; ఇదిలా ఉంటే&period;&period; చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్‌ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు&period; చిన్నారి ప్రమాదవశాత్తు కొండల్లోకి వెళ్లిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.