విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.

సాయికృష్ణ కేసులో కొనసాగుతోన్న సిట్‌ దర్యాప్తు

Advertisements

<p>ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ జెట్ స్పీడ్‌తో దర్యాప్తు చేపడుతోంది&period; ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; విచారణను ముమ్మరం చేసిన సిట్ అధికారులు&comma; ఈ కేసులో మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చారు&period; నిందితులుగా ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్‌&comma; నానిలకు విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించింది&period; జులై 14 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది&period; అశోక్‌ను మచిలీపట్నం&comma; నానిని ఏలూరు జైళ్లకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది&period; సాయికృష్ణ మృతి&comma; మృతదేహం మాయం వ్యవహారానికి సంబంధించి విజయవాడ కృష్ణలంక స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్&comma; నాని సౌత్‌ ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు&period; ఏసీపీ మానస వారిని సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు&period; విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు వీరిద్దరూ అన్నింటికీ మౌనం వహించారని&period;&period; ఒకటి&comma; రెండు ప్రశ్నలకు మాత్రమే తమకేం తెలియదని పొడిపొడిగా జవాబులు ఇచ్చినట్లు తెలుస్తోంది&period;లాకప్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లడం&comma; ఆపై మరణించడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం&comma; వేధింపులు ఉన్నాయనే కోణంలో సిట్ ఆధారాలను సేకరిస్తోంది&period; ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోగా&comma; తాజా పరిణామం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.