మోసపూరితంగా 60 కోట్ల విలువగల భూమిని కాజేయాలని చూసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి గ్రామ పరిధికి చెందిన సర్వేనెంబర్ 334, 335 గల 5 ఎకరాల 12 గుంటల భూమి దాని విలువ సుమారు 60 ఇట్టి భూమిని విజయవాడ ప్రాంతానికి చెందిన ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ మరియు అతని మిత్రులు కలిసి కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు 2014 ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆయన పేరుకు కలిసే విధంగా అతని కొడుకుల వ్యవరించే వీర వెంకట వర ప్రసాద్ ను వొప్పించి అతనికి 20 లక్షలు ఇస్తామని చెప్పి ఈ భూమిని మహబూబ్ నగర్ బేబ్బెర ప్రాంతానికి చెందిన నీలం గౌడ్, రవీందర్ కుమార్, ప్రశాంత్ మరియు కాటూరి హరిరంజని కి ఐదు కోట్లకు అమ్మడానికి చూపడంతో ఇట్టి విషయమై హరి రంజనీ అనే మహిళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ యొక్క భార్య అయితే ఈ నేపథ్యంలో కేవైసీ కాకుండా భూమి రిజిస్ట్రేషన్ అవ్వడానికి వీలుగా తన పై అధికారి మాటలను విని శంకర్పల్లి సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు ఈ విషయంపై సస్పెండ్ కాబడిండనీ నార్సింగ్ ఏసిపి వెంకటరమణ గౌడ్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నార్సింగ్ ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ కాకినాడ ప్రాంతానికి చెందిన ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు కలిసి ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్ ఫరం పేరు మీద 2005 సంవత్సరంలో శంకర్పల్లి ప్రాంతంలో గల సర్వేనెంబర్ 334 మరియు 335 మొత్తం భూమి 5 ఎకరాల 12 గుంటలు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి భూమిని కాకినాడ విజయవాడ మరియు మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులు భూమిని కాజెయాలని కుట్రపూరితముతో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ గారు 2014లో చనిపోయారని ఒక నకిలీ డెత్ సర్టిఫికెట్ ను క్రియేట్ చేసి అతని నకిలీ కొడుకుగా ముద్దాకుల వరప్రసాద్ అనే వ్యక్తిని క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేద్దామనుకున్న సమయంలో కేవైసీ రాకపోవడంతో అనుమానంతో వచ్చిన వ్యక్తులు పట్టాదారుకు కాల్ చేయగా అతను శంకరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయించడం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తులను పట్టుకోగా ఇంకా కొంతమంది వ్యక్తులు పరారిలో ఉన్నట్టు నార్సింగ్ ఏసిపి తెలిపారు.
ఇది చదవండి : కవిత అరెస్టుకు నిరసనగా చేవెళ్ల ఎమ్మెల్యే ప్రెస్ మీట్…
అందులో అరెస్ట్ అయిన వ్యక్తులు :-
1. దేవగానుగుల రామ వీర వెంకట వర ప్రసాద్ మచిలీపట్నం 2. పరశురాం పార్థసారథి విజయవాడ 3. పోతులూరి త్రినాథ్ విజయవాడ 4. పరశురాం విజయబార్గవాన్ విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మిగతా వ్యక్తుల గురించి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఏసిపి వెంకటరమణ గౌడ్ తెలిపారు.. మోసపూరితంగా కాజేయాలని చూసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి