పంట నష్టం.. పాలకుల నిర్లక్ష్యమే..

lose of fields

Advertisements

&NewLine;<p>జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి&period; చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు&period; ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్&comma; జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు&period; ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం కలిగిందని&comma; ఈ ప్రభుత్వం బీమనది ఛానల్ మురుగు డ్రైనేజీలో తూటికాడ&comma; గుర్రపుడెక్క సకాలంలో తొలగించలేదన్నారు&period; ఫలితంగా ఈ గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట దారుణంగా మొలకలు వచ్చి పంట దేనికి పనికిరాకుండా పోయిందన్నారు&period; బీమనది డ్రైనేజీకి రూ&period;12లక్షలు నిధులు కేటాయించినా పనులు జరగలేదన్నారు&period; తుఫాన్ ముందు సకాలంలో స్పందించి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటే అపార నష్టం తగ్గేదన్నారు&period; ఈ ప్రాంత రైతులకు కలిగిన నష్టానికి ప్రకృతి కారణం కాదని&comma; పాలకుల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమన్నారు&period; ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఒకట్రేండు డ్రైనేజీల దగ్గర ఫోటోలు దిగి మొత్తం పరిష్కారం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని&comma; కాని ఆయనకు పూషడం గ్రామ రైతుల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ప్రశ్నించారు&period; డ్రైనేజీ శాఖ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన పనులే చేస్తారా&quest; ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉందో గుర్తించి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా&quest; అని ప్రశ్నించారు&period; డ్రైనేజీ పనులు తీసుకున్న కాంట్రాక్టరుతో పనులు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు&period; నియోజకవర్గంలో అత్యధిక నష్టం కలిగిందన్నారు&period; అధికారులు&comma; ప్రజా ప్రతినిధులు కలిసి రైతులను నట్టింట ముంచేశారన్నారు&period; తక్షణమే సీఎం జగన్ రైతులకు ఏ సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు&period; అసలు పంటల బీమా ఈ ఏడాది రైతులకు వర్తిస్తుందా లేదా ప్రకటించాలని ప్రశ్నించారు&period; ఈ ప్రభుత్వంలో రైతులకు బీమా పరిహారం దక్కిన దాఖలాలు లేవన్నారు&period; కృష్ణాజిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మిచౌంగ్ పంట నష్టం పరిశీలించలేదన్నారు&period; ఇప్పటికైనా కలెక్టర్ పంట నష్టం పరిశీలించాలని&comma; ఈ పూషడం గ్రామ రైతులను పరామర్శించి&comma; ప్రభుత్వ సహాయంపై స్పష్టత ఇచ్చి ఆదుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరారు&period; తక్షణమే రైతులకు తదుపరి పంటకు ఇన్ పుట్స్ మొత్తం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; పది ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు గల్లా వెంకటేశ్వరరావు&comma; 16 ఎకరాలు సాగు చేసిన పీ&period;సాంబశివరావు&comma; ఏడెకరాలు సాగు చేసిన అంకం నాంచారయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు&period; తమ పంట పూర్తిగా నాశనం అయిపోయిందని కోత కోసినా ప్రయోజనం లేదన్నారు&period; వరి పంట మొత్తం దున్నేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు&comma; జనసేన నాయకులు&comma; జనసేన సర్పంచులు&comma; రైతులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..