తిరుమల (Thirumala) పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు క్యూలైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ, ఆన్ లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. టీటీడీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుం బిగించింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీటీడీ నుంచి శుభవార్త వెలువడింది. వేంకటేశ్వరుని ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైమ్ స్లాట్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందుకోసం వృద్ధులు తమ ఫొటో ఐడెండిటీతో వయస్సు రుజువును సమర్పించాలి. సంబంధిత పత్రాలను ఎస్-1 కౌంటర్లో సమర్పించాలి. వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూలైన్లలో రావాల్సిన అవసరం లేకుండా… వంతెన కింద గ్యాలరీ నుంచి, ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్లొచ్చు. అంతేకాదు, వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూలైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు 30 నిమిషాల్లోపు ఆలయం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.