ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు(General Elections) జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) వాలంటీర్ల విషయంలో జిల్లా కలెక్టర్ల(District Collector)కు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తక్షణమే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టేనని అన్నారు. వాలంటీర్లు పోలింగ్(Polling volunteers) ఏజెంట్లుగానూ ఉండరాదని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో, సీఎస్ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికలు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి