Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతపురం జిల్లా.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ హోటల్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై (cylinder leak) మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడి, క్షణాలలో హోటల్ మొత్తం వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా స్థానికులు శ్రమించారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసుకున్న కూడేరు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. గాయపడ్డ మరో బాలికను ఉన్నత చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.