75
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకుల మర్రు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన స్మశాన వాటిక, హల్త్ క్యాంపు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. 30 నుంచి రూ. 40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యం అన్నారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు నా దృష్టిలో చాలా అదృష్టవంతులని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా చేసి, సంపదనంతా పార్టీ అధిపతులు వద్దకు చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవచేసే అవకాశం లేదంటూ దగ్గుబాటి అన్నారు.