సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ పలుగు పట్టి తవ్వి… మట్టి తట్టలు ఎత్తి… కాసేపు ఉపాధి హామీ కూలీ అవతారమెత్తారు. ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా మట్టి పనులు చేశారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కలుసుకున్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని మళ్లీ కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో రోజువారి కనీస కూలీ 400 రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటీలు విజయవంతంగా ప్రజలకు అందుతున్నాయని, మిగిలిన రెండు పథకాలు కూడా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేస్తామని ఎమ్మెల్యే రాగమయి అన్నారు.
కూలీ అవతారమెత్తిన దయానంద్…
149
previous post