భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిణమించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ, డెమొక్రాటిక్ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని, మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధికి హానికరమని ఎండీపీ, డెమొక్రాట్ పార్టీల నేతలు విమర్శించారు. భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన పై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల పర్యవసానంతో ఇరుదేశాల మధ్య దౌత్య బంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చైనాకు చెందిన గూఢాచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్ట వేయడం ఆసక్తికరంగా మారింది. భారత్‌తో దౌత్య బంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ, సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. భారత్‌ను దీర్ఘకాల మిత్రదేశంగా అభివర్ణించాయి. విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు.
మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహం
48
previous post