భారత్(India)లో ఉగ్రవాద కార్యకలాపాలకు యత్నించి సరిహద్దులు దాటి పారిపోయిన వారిని వదిలిపెట్టేదేలేదని, అలాంటి తీవ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్థాన్(Pakistan)లోకి భారత్ ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) హెచ్చరించారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వారిని ఏరివేసేందుకు పాక్‌లోకి ప్రవేశిస్తామని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని అన్నారు. అయితే పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇది చదవండి: హిమాచల్ ప్రదేశ్ చంబాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు
విస్తృత ప్రణాళికలో భాగంగా విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తోందని, 2020 నుంచి పాకిస్థాన్‌లో 20 మందిని మట్టుబెట్టిందంటూ బ్రిటన్‌కు చెందిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించేందుకు నిరాకరించింది. కాగా 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి