127
కరీంగనర్ లో తెలంగాణ తల్లి విగ్రహం తక్షణం ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. తమపై నెపం నెట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి నెల దాటినా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్యమిస్తే తమను అరెస్టు చేసిన విషయాన్ని రవీందర్ సింగ్ గుర్తు చేశారు.