ఆయ్యప్ప భక్తుల తాకిడితో శబరిమల గిరులు నిండిపోయాయి. 19గంటల పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నవంబర్ 17నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులు మణికంఠుని దర్శించుకునేందుకు దీక్షలు చేపట్టారు. శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపు తప్పుతున్న నేపథ్యంలో హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు ధర్మాసనం దేవస్థానంను ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదని కోర్టు కోరింది. శబరిమల వద్ద భక్తులకు సహాయం చేసేందుకు సమీపంలోని కళాశాలల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాడెట్ల సహాయాన్ని కోరాలని దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్లు, స్పాట్లో 30 వేల బుకింగ్స్ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజూ 19 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీబీడీ పేర్కొంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పొడిగించింది. ప్రస్తుతం రోజుల్లో రెండో భాగంలో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు.
శబరిమల గిరులపై పోటెత్తిన భక్తులు..
68