67
కార్తీక సోమవారం , పౌర్ణమి కలిసి రావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర రేవులు కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నది లో స్నానం ఆచరించిన భక్తులు గట్టుపై కుటుంబ సమేతంగా కార్తీక దామోదర పూజలు చేసుకుని నదిలో దీపాలు విడిచిపెట్టారు. ఇటు పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అభిషేకాలు చేయించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు.