భద్రాద్రి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం.

భద్రాద్రి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం

Advertisements

<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విస్తరణ&comma; అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి&period; ఈ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తర ద్వారం వరకు ఆలయాన్ని రెండు ప్రాకారాలుగా విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు&period;ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారాన్ని తొలగించారు&period; ఉత్తరం వైపున భారీ నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే భూసార పరీక్షలను కూడా పూర్తి చేశారు&period;<br &sol;>&NewLine;డిసెంబర్ 10 నుంచి 30 వరకు జరగనున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు ముందే ఉత్తరం వైపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం&comma; దేవాదాయ శాఖ అధికారులు&comma; కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది&period;భద్రాచలంలో తొలినాళ్లలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు దక్షిణ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చేవారు&period; అనంతరం 1972లో అప్పటి దేవస్థాన చైర్మన్ అల్లూరి మూర్తిరాజు ఆధ్వర్యంలో ఉత్తర ద్వారాన్ని నిర్మించారు&period; కేవలం 45 రోజుల్లో పూర్తయిన ఈ ద్వారం అప్పటి నుంచి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది&period;అలాగే 2010లో నిర్మించిన ఇనుప ఫుట్‌బ్రిడ్జిని కూడా అభివృద్ధి పనుల కోసం పూర్తిగా తొలగించారు&period; కొత్త నిర్మాణాలతో భక్తులకు మరింత విశాలమైన&comma; సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపడుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.