ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర.

ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర

Advertisements

<p>తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ&period; డప్పు చప్పుళ్లు&comma; శివసత్తుల పూనకాలు&comma; పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని ఆలయాలకు తరలివెళతారు&period; తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి&period; గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా షురూ కానున్నాయి&period; చరిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారికి నిర్వహించే ప్రథమ పూజతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది&period; రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది&period; ఇవాళ లంగర్‌హౌస్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రులు కొండా సురేఖ&comma; పొన్నం ప్రభాకర్ ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు&period; అనంతరం ప్రభుత్వం తరపున జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు&period;<&sol;p>&NewLine;<p>ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు&period; ఈ పవిత్ర వేళ&comma; ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు&comma; ఐశ్వర్యం&comma; సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు&period; బోనాల పండుగ భక్తి&comma; శక్తి&comma; ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు&period; అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం&comma; ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు&comma; సంతోషం&comma; ధైర్యం&comma; విజయాలను నింపాలని ఆకాంక్షించారు&period; జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ&comma; ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్‌ ప్రజల జీవన విధానం&comma; సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని&comma; ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక&comma; సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు&period; జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు&comma; తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం అని&comma; లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్లడించారు&period; బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌&comma; రంగారెడ్డి&comma; మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు&period; ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ&period; 20 కోట్లు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇక బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు&period; లంగర్‌హౌస్ చౌరస్తాలో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల నుండి కోటపై తొట్టెల సమర్పణ పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.