నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత..

నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత

Advertisements

<p>ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌ మరమ్మతు పనులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి&period; ఈ నేపథ్యంలో నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేస్తున్నట్టు ప్రకటించారు ఆలయ అధికారులు&period; భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు&period; భక్తుల కోసం కనకదుర్గ నగర్‌ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు&period; ఘాట్‌ రోడ్‌ మూసివేత దృష్ట్యా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు&comma; తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆలయ ఈవో&period; ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు&period; ప్రస్తుతం ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రోటోకాల్‌ ఆఫీస్‌ను వెంటనే కొండ దిగువన కనకదుర్గ నగర్‌లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు&period; కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ వద్ద భక్తుల రవాణా కోసం ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తగినన్ని బ్యాటరీ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు&period; భక్తుల రద్దీని నియంత్రించడానికి ఘాట్‌ రోడ్‌లో ఉన్న టికెట్‌ కౌంటర్‌ సిబ్బందిని కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ వద్దకు మార్చారు&period; కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ నుండి మహా మండపం వరకు అదనపు సెక్యూరిటీ గార్డులను&comma; సూపర్‌వైజర్లకు విధులు కేటాయించారు&period; ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే భక్తుల దర్శనాల కోసం మహా మండపం వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేశారు&period; నిత్య పూజలు&comma; సేవల కొరకు కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది&period; ఘాట్‌ రోడ్‌ మూసివేత&comma; ప్రత్యామ్నాయ మార్గాల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ పరిసరాల్లో మైక్‌ ద్వారా నిరంతరం అనౌన్స్‌మెంట్స్‌ చేయనున్నారు&period; సీతమ్మవారి పాదాల నుంచి&comma; కుమ్మరి పాలెం సెంటర్‌ నుంచి&comma; పున్నమి ఘాట్‌ నుంచి నిరంతరం దేవస్థానం బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..