86
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో నిలిపి ఉంచిన లారీల్లో దొంగలు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ఓ రైస్ మిల్ ముందర నిలిపి ఉంచిన నాలుగు లారీల్లోని డీజిల్ చోరీ అయినట్లు గుర్తించారు. ఉదయం అక్కడికి వచ్చిన హమాలీలు లారీల డీజిల్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటాన్ని గమనించి యజమానులకు తెలిపారు. ఇటీవల కాలంలో కేశవపట్నం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు వారి వాహనాలను బయట నిలిపి ఉంచేందుకు జంకుతున్నారు.