74
తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదన్నారు. రాహుల్‌గాంధీ 2014 నుంచి ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారని విమర్శించారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్ గా ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆరోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.