అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

District Collector inspected the development works

Advertisements

&NewLine;<p>హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు&period; పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎల్లమ్మ చెరువు విస్తీర్ణo వివరాలను ఇరిగేషన్ డిఇ రాములును అడిగి తెలుసుకున్నారు&period; పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ఎస్టిమేట్ చేయాలని ఇరిగేషన్&comma; టూరిజం డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు&period; ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనమును మరియు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంను పరిశీలించారు&period; ఏయే కోర్సుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారో&comma; ఎంత మంది విద్యార్థులు ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతిని అడిగి తెలుసుకున్నారు&period; నూతన భవనంలోకి షిఫ్ట్ కావడానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ&comma; త్రాగునీరు తదితర చిన్నచిన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు&period; అనంతరం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి హనుమకొండ దారిలో గుర్తించిన 30 ఎకరాల భూమిని పరిశీలించారు&period; కలెక్టర్ వెంట హుస్నాబాద్ తహాసిల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..