గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన…

Protest against construction of Greenfield Highway...

Advertisements

&NewLine;<p>గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మా వ్యవసాయ భూములను లక్కోవద్దని రైతులు అధికారులను డిమాండ్ చేశారు&period; లక్షెట్టిపేట &&num;8211&semi; మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో బాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కోవడాని ప్రయత్నిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు&period; మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట&comma; హజీపుర్ మండల గ్రామాల రైతులు మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు&period; గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములను కోల్పోయామని అరకొర నష్టపరిహారం ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు&period; మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి మా భూములను లాక్కోవాలని నాయకులు&comma; అధికారులు చూస్తున్నారని వారు మండిపడ్డారు&period; గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం గతం లో చేసిన సర్వే ఆధారంగానే నిర్మించాలని ఉన్న కొందరు రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు&comma; నాయకుల స్వలాభం కోసం నాలుగు వరసల హైవే రోడ్డు నిర్మాణం కోసం మరో సర్వే నిర్వహించి తమ విలువైన భూములను నాశనం చేయడానికి పూనుకున్నారని అన్నారు&period; దీంతో అనేకమంది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఎవరి స్వలాభం కోసం రోడ్డు నిర్మాణ సర్వేలు ఎందుకు మార్చారో అని అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు&period; మా సమస్యలు చెప్పుకుందామని ఆర్డిఓ కార్యాలయానికి వస్తే కనీసం మా వినతి పత్రాన్ని కూడా అధికారులు తీసుకోవడం లేదని విమర్శించారు&period; ఇప్పటికైనా గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ ను మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు&period; లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు&period; కార్యక్రమంలో సుమారు 12 గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.