ఎక్కువ సేపు వాడిన తర్వాత పోర్ట్‌లు, స్పీకర్‌లు ఇలా ఫోన్‌లోని చాలా భాగాల్లో మురికి పేరుకుపోతుంది. అందువల్ల ఫోన్ పాతదిగా కనిపించడం ప్రారంభిస్తుంది. వృత్తి నిపుణులతో క్లీన్ చేయిస్తే కొత్తగా కనిపిస్తుంది. అంతేకాదు ఆడియో వాల్యూమ్ కూడా బాగా వినిపిస్తుంది. ఫోన్‌కి కొత్త రూపాన్ని ఇవ్వడానికి, ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ముఖ్యం. దీంతో జంక్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయి మీ ఫోన్ కొత్తగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు మీరు ఫోన్ డేటా బ్యాకప్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలాసార్లు, ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉంటే, మళ్లీ మళ్లీ బ్యాటరీ బ్యాకప్ సమస్య ఎదురవుతుంది. అలాంటి సమయంలో ఇక ఈ ఫోన్ పని అయిపోయింది, దీన్ని ఎక్స్‌ఛేంజ్ చేసేసుకోవాలి అనుకుంటారు. నిజానికి అలా చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా ఫోన్ బ్యాటరీని మార్చుకోవచ్చు. తద్వారా మళ్లీ ఫోన్ ఛార్జింగ్ బాగుంటుంది. మీరు కంపెనీ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఫోన్ బ్యాటరీని మార్చుకోవచ్చు. ఫోన్ నుంచి అనవసరమైన మీడియా ఫైల్‌లను తొలగించండి. అనవసరమైన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. కాచ్ రూపంలో ఉన్న డేటాను కూడా క్లియర్ చేయండి. తద్వారా మీ ఫోన్ వేగం పెరుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఒక మంచి విషయం ఏమిటంటే, మీరు వాటిలో అనేక లాంచర్లను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు Google Play Store నుంచి కొత్త లాంచర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తద్వారా ఫోన్‌కు తాజా రూపాన్ని ఇవ్వవచ్చు. Nova Launcher, Action Launcher, Microsoft Launcher వంటివి ఫోన్‌ని సరికొత్తగా చూపిస్తాయి. చాలా మంది ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను చాలా కాలం వరకూ అప్‌డేట్ చెయ్యరు. ఈ కారణంగా ఫోన్, కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందలేదు. ఫోన్‌లో సమస్యలు మొదలవుతాయి. అది నెమ్మదిస్తుంది. అలా కాకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తే, ఫోన్ పరుగులు పెడుతుంది.
ఫోన్ హ్యాంగ్ అవుతుందా అయితే ఇలా చేయండి!
160
previous post